ఈ యాప్ పరిచయం
మీకు WhatsAppలో బాగా నచ్చే అన్ని విషయాలతో పాటు అదనంగా వ్యాపారం కోసం అంతర్నిర్మిత టూల్‌లు
WhatsApp Business అనేది తెలివిగా పని చేయడం, నమ్మకాన్ని పెంపొందించుకోవడం మరియు మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం వంటి వాటిలో మీకు సహాయపడే అంతర్నిర్మిత టూల్‌లను కలిగి ఉన్న యాప్, దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సంభాషణలతో మరిన్ని ప్రయోజనాలను పొందడంలో మీకు సహాయకరంగా ఉండటానికి, మీరు ఉచిత కాల్‌లు* మరియు ఉచిత అంతర్జాతీయ మెసేజింగ్*, అదనంగా వ్యాపార ఫీచర్‌లను పొందుతారు.
ఇలాంటి వ్యాపార ప్రయోజనాలను పొందడానికి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి:
తెలివిగా పని చేయండి. మీకు బదులుగా మీ కోసం యాప్ పని చేయడానికి అనుమతించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోండి! కస్టమర్‌లకు ఆటోమేటిక్ త్వరిత రిప్లైలు మరియు అందుబాటులో లేనట్లుగా తెలిపే మెసేజ్‌లను పంపండి, తద్వారా మీరు ఎప్పుడూ ఎలాంటి అవకాశాన్ని కోల్పోరు. ముఖ్యమైన సంభాషణలను నిర్వహించడం, ఫిల్టర్ చేయడం మరియు కనుగొనడం వంటివి త్వరగా చేయడానికి లేబుల్‌లను ఉపయోగించండి. ఆఫర్ లేదా వార్తలను షేర్ చేయడానికి స్టేటస్‌ని సృష్టించండి, అంతేకాకుండా గొప్ప కస్టమర్ అనుభవాన్ని సృష్టించడానికి యాప్‌లోనే ఆర్డర్‌లు మరియు చెల్లింపులు** తీసుకోండి.
బాంధవ్యాలు మరియు నమ్మకాన్ని పెంపొందించుకోండి. సురక్షితమైన ప్లాట్‌ఫారమ్‌లో ప్రొఫెషనల్ బిజినెస్ ప్రొఫైల్‌తో, మీరు కస్టమర్‌ల విశ్వసనీయతను మరియు నమ్మకాన్ని పెంపొందించుకుంటారు. మరింత ప్రతిస్పందనాత్మక కస్టమర్ సహాయాన్ని అందించడానికి మరియు దీర్ఘకాలిక విధేయతను పెంపొందించడానికి యాప్‌ని ఉపయోగించండి. మీ ప్రామాణికతను బలపరచడానికి Meta Verified***కి సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
మరిన్ని విక్రయాలు జరపండి, అభివృద్ధి చెందండి. శోధనలో కనిపించండి, అడ్వర్టయిజ్ చేయండి మరియు మరింత విలువైన కస్టమర్ కనెక్షన్‌లను ఏర్పరుచుకోండి. కస్టమర్‌లకు లక్ష్యం చేయబడే ఆఫర్‌లను పంపడం ద్వారా విక్రయాలను పెంచుకోండి; WhatsAppకి తీసుకెళ్లే క్లిక్ చేసే యాడ్‌లను సృష్టించండి; మీ ఉత్పత్తి కాటలాగ్‌ను ప్రదర్శించండి; అలాగే కస్టమర్‌లకు యాప్‌లో ఆర్డర్‌లు మరియు చెల్లింపుల సౌలభ్యాన్ని అందించండి.**
ప్రశ్నలు జవాబులు
అన్ని ఫీచర్‌లు ఉచితమేనా?
యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం మరియు ఉపయోగించడం ఉచితం, దీనిలో ఉచిత మరియు చెల్లింపు ఫీచర్‌లు కలిపి ఉంటాయి.
నేను ఇప్పటికీ నా వ్యక్తిగత WhatsAppని ఉపయోగించవచ్చా?
అవును! మీరు రెండు వేర్వేరు ఫోన్ నంబర్‌లను కలిగి ఉన్నంత వరకు, మీ వ్యాపారం మరియు వ్యక్తిగత ఖాతాలు ఒకే డివైజ్‌లో కలిసి ఉండవచ్చు.
నేను నా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చా?
అవును. మీరు WhatsApp Business యాప్‌ను సెటప్ చేసినప్పుడు, మీ బిజినెస్ ఖాతాకు మీ మెసేజ్‌లు, మీడియా మరియు కాంటాక్ట్‌లను ట్రాన్స్‌ఫర్ చేయడానికి మీ WhatsApp ఖాతా నుండి బ్యాకప్‌ని పునరుద్ధరించవచ్చు.
నేను ఎన్ని డివైజ్‌లను కనెక్ట్ చేయవచ్చు?
మీరు మీ ఖాతాలో మొత్తం ఐదు (మీరు Meta Verified***కి సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, గరిష్టంగా 10) వెబ్ ఆధారిత డివైజ్‌లు లేదా మొబైల్ ఫోన్‌లను కలిగి ఉండవచ్చు.
*డేటా చార్జీలు వర్తించవచ్చు. వివరాల కోసం మీ ప్రొవైడర్‌ను సంప్రదించండి.
**అన్ని మార్కెట్‌లలో అందుబాటులో లేదు
***త్వరలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తుంది
అప్‌డేట్ అయినది
8 మే, 2025